Crime29th Apr 12:03 PMSunil Byrisetty1 min read
కత్తి పోటుకు 2 లక్షలు? ఒంగోలు హత్యలో వెలుగులోకి!
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా వేగంగా ఎదిగిన వీరయ్య చౌదరికి అదే స్థాయిలో శత్రువులు ప
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆర్థికంగా, రాజకీయంగా వేగంగా ఎదిగిన వీరయ్య చౌదరికి అదే స్థాయిలో శత్రువులు పెరిగారు.
ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో వీరయ్య హత్యకు సుపారి ఇచ్చిన నిందితులు ఏకంగా కత్తిపోటుకు రూ. 2 లక్షలు ఇస్తామని మాట్లాడుకున్నారట.
అందుకే హంతకులు వీరయ్య చౌదరిని కత్తిపోట్లతో తూట్లు పొడిచారు.
వీరయ్య చౌదరి మృతదేహంపై మొత్తం 53 కత్తి పోట్లు ఉన్నాయి.
దీంతో సుపారి మొత్తం కాకుండా కోటి ఆరులక్షల రూపాయలు హంతకులకు అందుతాయట.
పోలీస్ విచారణలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.