News8th Sep 12:52 PMSunil Byrisetty1 min read

ఘాటెక్కిన ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల కిందట కేజీ రూ.30-50 ఉండగా,, ప్రస్తుతం రూ.70-80కి చేరింది.. తెల్ల ఉల్లి ధర ఏకంగా రూ.100 దాటిపోయింది. హైదరాబాద్ మ

ఘాటెక్కిన ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల కిందట కేజీ రూ.30-50 ఉండగా,, ప్రస్తుతం రూ.70-80కి చేరింది.. తెల్ల ఉల్లి ధర ఏకంగా రూ.100 దాటిపోయింది. హైదరాబాద్ మలక్ పేట హోల్సేల్ మార్కెట్లో క్వింటా ఉల్లి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది. ఎల్ నినో ప్రభావంతో మహారాష్ట్ర,, కర్ణాటకలో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. స్థానిక పంట వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఉల్లిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Telangana
Andhra Pradesh
Onion Prices
Onion Price Hike
Hyderabad
Malakpet Market
Vegetable Prices
ఎల్ నినో
ఉల్లి సరఫరా
రైతు బజార్లు
సబ్సిడీ ఉల్లి
వినియోగదారుల ధరలు
ఉల్లి మార్కెట్
Scroll for the next article