News30th Sep 01:10 PMSunil Byrisetty1 min read
రూ. 35కే కిలో ఉల్లి
రైతుబజార్లలో రాయితీ ధరకే ఉల్లి పంపిణీ ప్రారంభమైంది. రాయితీ ధరకే ఉల్లి పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. విజయవాడ ఏపీఐఐసీ రైతుబజార్లో మంత్రి మనోహర్ ప్రారంభించి మాట్లాడు
రైతుబజార్లలో రాయితీ ధరకే ఉల్లి పంపిణీ ప్రారంభమైంది. రాయితీ ధరకే ఉల్లి పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. విజయవాడ ఏపీఐఐసీ రైతుబజార్లో మంత్రి మనోహర్ ప్రారంభించి మాట్లాడుతూ రైతుబజార్లలో కిలో ఉల్లిని రూ.35కే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. ఆధార్ లేదా రేషన్‌కార్డు చూపిస్తే కుటుంబానికి 2 కిలోల ఉల్లి పంపిణీ చేస్తామన్నారు. 130 రైతు బజార్లలో రాయితీపై ఉల్లి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మొబైల్ వాహనాల ద్వారా కూడా ఉల్లి పంపిణీ చేస్తామన్నారు. త్వరలో పామాయిల్, కందిపప్పు, పంచదార, గోదుమ పిండి పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.