Crime8th May 12:16 PMSunil Byrisetty1 min read

ట్రెండ్‌ బట్టి లింకులు.. ఖాతా ఖాళీ!

నమ్మించి మోసం చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు మార్కెట్‌లో ఉన్న ట్రెండ్‌లు అనుసరిస్తున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం డబ్బులు పంపుతుందని చెబుతూ నమ్మించి వల విసిరారు. తర్వాత నకిలీ రుణ యాప్‌

ట్రెండ్‌ బట్టి లింకులు.. ఖాతా ఖాళీ!
నమ్మించి మోసం చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు మార్కెట్‌లో ఉన్న ట్రెండ్‌లు అనుసరిస్తున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం డబ్బులు పంపుతుందని చెబుతూ నమ్మించి వల విసిరారు. తర్వాత నకిలీ రుణ యాప్‌లను వదిలారు. కొంతకాలంగా పార్ట్‌టైం ఉద్యోగాలని, కిసాన్‌ యోజన డబ్బులు పడ్డాయని బురిడీ కొట్టించారు. ఇటీవలి వరకు డిజిటల్‌ అరెస్టులంటూ మోసగించారు. ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు ఇస్తున్నాముని, రివార్డులు, అప్లికేషన్ల పేరిట ఫోన్‌ హ్యాక్‌చేసి దగా చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్‌ పంపి బుట్టలో వేసుకునే విధానం పాతదే అయినా ఫోన్‌ హ్యాక్‌చేసి వ్యక్తి ప్రమేయం లేకుండానే నగదు దారి మళ్లించడం చేస్తున్నారు. ఎస్ఎంఎస్ ద్వారానో, కాల్‌ ద్వారానో మాయమాటలతో నమ్మించి ఏపీకే యాప్‌ను పంపిస్తున్నారు. దాన్ని టచ్‌ చేయగానే ఫోన్‌ ఆపరేటింగ్‌ మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. ఖాతాల్లో నగదు లేకుంటే ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లకు ఆసుపత్రిలో ఉన్నా ఇతర సమస్యల్లో ఉన్నానని డబ్బులు పంపమని మెసేజ్‌లు చేస్తున్నారు. లేకుంటే వీడియో కాల్‌ ద్వారా సేకరించిన బాధితుడి ఫొటో మార్ఫింగ్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు.
Online cyber crimes
CYBER CRIMES BY LINKS
PRECAUTIONS FOR CYBER CRIMES
సైబర్ నేరాలు
ఫోన్‌ హ్యాక్‌
ఫొటో మార్ఫింగ్‌ చేసి డబ్బు డిమాండ్‌
Scroll for the next article