News6th Sep 03:54 PMSunil Byrisetty1 min read

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు

గుంటూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండపాల ఏర్పాటుకు 'సింగిల్ విండో విధానం’ ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అనుమ

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు
గుంటూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండపాల ఏర్పాటుకు 'సింగిల్ విండో విధానం’ ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అనుమతుల కోసం పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులను ఒకే చోట సులభంగా పొందే విధంగా https://ganeshutsav.net/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత శాఖల నిబంధనలను పాటిస్తూ అనుమతులు పొందాలని సూచించారు. మండపాల ఏర్పాటులో నిర్వాహకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారులకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఎస్పీ ఆదేశించారు. మండపాల వద్ద విద్యుత్ వైరింగ్, విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు, లైటింగ్ ఏర్పాట్లు తదితర అంశాల్లో నిర్లక్ష్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh
Ganesh Chaturthi
Ganesh Mandaps
Guntur
Guntur Police
Vakul Jindal
Online Permissions
Single Window System
గణేష్ ఉత్సవాలు
వినాయక ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్
ఉత్సవ భద్రత
గణేష్ మండపాల అనుమతులు
Scroll for the next article