News4th Apr 04:04 PMSunil Byrisetty1 min read

10 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్.. డబ్బు కోసం గడ్డి తినే ప్రభుత్వం కాదు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ర్టేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను సచివాలయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. మ

10 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్.. డబ్బు కోసం గడ్డి తినే ప్రభుత్వం కాదు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ర్టేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను సచివాలయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్ష్యులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చన్నారు. 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, మొత్తం 296 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని ఫీజు కూడా కట్టేసి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చిన 10 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్ పూర్తయిపోతుందన్నారు. ఒక వేళ స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయిన వారు సబ్ రిజిస్టార్ ఆఫీసుకు వస్తే సాయంత్రం ఐదు గంటల తర్వాత రిజిస్ర్టేషన్ చేస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా రూ. ఐదు వేల రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పారు. 2024-25 ఏడాదికి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని వార్తలు రాశారని, డబ్బు కోసం గడ్డితినే ప్రభుత్వం మాది కాదని అన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ registration.ap.gov.in లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా డేటా ఎంట్రీ చేసి అప్లికేషన్ నెంబర్ పొందాలని మంత్రి అనగాని సూచించారు. తర్వాత స్లాట్ బుకింగ్ మాడ్యూల్‌లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరోజు నుంచి 15 రోజుల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు.
Online Slot Booking
Registration
Andhra Pradesh
మంత్రి అనగాని సత్యప్రసాద్
Scroll for the next article