News22nd Aug 01:31 PMSunil Byrisetty1 min read
డేటా సెంటర్ల కోసం 3.5 టీఎంసీల నీరు చాలు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు డేటా సెంటర్లు పెట్టే
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు డేటా సెంటర్లు పెట్టేందుకు భారతదేశానికి వచ్చాయని, విశాఖపట్నం సుందరమైన నగరమని ఎంచుకున్నాయని తెలిపారు. విశాఖలో డేటా సెంటర్ వస్తే బెంగళూరు కలవర పడిందన్నారు. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయన్నారు. కానీ ఇక్కడి కొంతమంది వద్దని నల్లజెండాలు పట్టుకుంటున్నారన్నారు. వారికి డేటా సెంటర్లంటే ఏంటో తెలియదని, వాటి లాభాలు తెలియవని, కేవలం రాజకీయాలు కావాలని వ్యాఖ్యానించారు. ఇంతవరకు డేటా సెంటర్ నిర్మాణం ప్రారంభం కాకపోయినా, నీరు ఇంకిపోయాయని, తాగడానికి నీళ్లు లేవని, తమకు వద్దని ప్రచారం చేస్తున్నారని అన్నారు. మన యువతకు ప్రోత్సాహం అందిస్తే ప్రపంచాన్ని శాసించగలుగుతారని పేర్కొన్నారు. ఒక డేటా సెంటర్ను తాను ప్రారంభిస్తే తర్వాత 5 వచ్చాయని తెలిపారు. 5 గిగావాట్ల ప్రాజెక్టులు ఇక్కడకు వచ్చాయని, వాటివల్ల కొన్ని లక్షల మంది డేటా ప్రొఫెషనల్స్ రూపొందుతారని వివరించారు. మంచి ఉద్యోగాలు వస్తాయని, తద్వారా ఆదాయం ఆకాశమే హద్దుగా ఉంటుందన్నారు. వీటికి 3.5 టీఎంసీల నీరు కావాల్సి ఉంటుందని చెప్పారు.