News11th Jul 11:58 AMSunil Byrisetty1 min read
ఇంకా మూడు రోజులే ‘సర్’
రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ముందుగానే ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్త
రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ముందుగానే ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. డిజిటలైజేషన్‌కు సమయం కావాల్సి ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. అనేక నియోజకవర్గాల్లో ఇంకా ఎన్యూమరేష న్ ఫారాలు మిగిలిపోవడం, తీసుకున్న ఫారాలను ప్రజలు తిరిగి ఇవ్వక పోవడం అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా ప్రజల్లో ఆశించిన స్పందన రావడం లేదని అధికారులు వాపోతున్నారు. అయితే ఆ ఫారాల ను పూరించడం కష్టతరమని రాజకీయ పార్టీల ఏజెంట్లు వ్యాఖ్యానిస్తున్నారు. కనుక అర్హుల ఓట్లు పోకుండా ‘సర్’ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చివరి రోజులు సర్వర్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని, ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లను మరిన్ని పెంచి డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని కోరుతున్నారు.