News3rd Apr 09:49 AMSunil Byrisetty1 min read
డ్రోన్ ఎగిరిందా.. బుక్కయిపోయినట్లే!
తెలుగు రాష్ట్రాల్లో పోలీసింగ్ కొత్త పంథాలో సాగుతోంది. ఆధునిక సాంకేతికతతో అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఇటీవల లారీలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ సాయంతో గుర్తించ
తెలుగు రాష్ట్రాల్లో పోలీసింగ్ కొత్త పంథాలో సాగుతోంది. ఆధునిక సాంకేతికతతో అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు.
ఇటీవల లారీలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ సాయంతో గుర్తించిన పోలీసులు వారి ఆట కట్టించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పుడు అదే తరహాలో డ్రోన్ గస్తీతో మందుబాబులకు చుక్కలు చూపిస్తు్న్నారు.
మంగళగిరి గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ నిర్వహించి బహిరంగంగా మద్యం సేవిస్తు్న్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
నిడమర్రు గ్రామ పరిదిలో గల టిడ్కో గృహాల వెనుక నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ గస్తీ నిర్వహించి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మంగళగిరి రూరల్ పరిధిలో నిరంతర డ్రోన్ గస్తీ నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఓపెన్ డ్రింకింగ్ చేస్తే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ హెచ్చరించారు.