Telangana2nd Jun 04:34 PMSunil Byrisetty1 min read

కగార్ దెబ్బకు.. మావోల లొంగుబాటు!

ఛత్తీస్‌గఢ్‌లో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో 16 మంది

కగార్ దెబ్బకు.. మావోల లొంగుబాటు!
ఛత్తీస్‌గఢ్‌లో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. వీరిలో ఆరుగురిపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. వీరు లొంగిపోవడంతో స్థానిక కెర్లపెండ గ్రామం నక్సల్స్‌ రహిత గ్రామంగా మారినట్లు పోలీసులు వివరించారు. భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో పెద్దసంఖ్యలో చనిపోతున్న తరుణంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.
Telangana News
Maoists Surrender
operation kagaru
chattisgarh
Encounters
16 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఆపరేషన్ కగార్’ ఎఫెక్ట్
Scroll for the next article