News9th Jul 09:37 AMSunil Byrisetty1 min read

విద్యాసంస్థల వద్ద “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్”

ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఆకే. రవికృష్ణ మార్గనిర్దేశనంలో “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్” అనే ప్రత్యేక డ్రైవ్‌ను గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పర

విద్యాసంస్థల వద్ద “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్”
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఆకే. రవికృష్ణ మార్గనిర్దేశనంలో “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్” అనే ప్రత్యేక డ్రైవ్‌ను గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, బడ్డీ, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై దృష్టి సారించారు. అనుమానిత విక్రయదారులపై తగిన విధంగా చర్యలు తీసుకొని, ఇకపై మత్తు పదార్థాలు అమ్మకుండా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. విద్యాసంస్థల పరిసరాలలోని షాపుల యజమానులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి,“ఈ షాపులో సిగరెట్లు, మత్తు పదార్థాలు అమ్ముబడవు” అనే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరి పిల్లలైనా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్టు తెలిసినట్లయితే, వెంటనే మీ దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలని, వీరిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి అవసరమైన మార్గదర్శనం అందిస్తామని తెలిపారు.
Andhra Pradesh news
Eluru
harish Gupta
Operation Save Campus Zone
Police teams
Police checking cigarettes and tobacco products
raids on shops
విద్యాసంస్థల వద్ద ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్
Scroll for the next article