National20th Jun 11:00 AMSunil Byrisetty1 min read

ఇరాన్ వార్.. భారత్ ఆపరేషన్ సింధు

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధు ప్రారంభించింది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేర

ఇరాన్ వార్.. భారత్ ఆపరేషన్ సింధు
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధు ప్రారంభించింది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్‌కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కశ్మీర్‌కు చెందిన వారు కాగా.. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో బారులు తీరాయి. రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. “నా కొడుకు ఇరాన్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు భారత ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చాడు. నేను భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని అన్నారు.
Government of India
Operation Sindhu
Israel Iran War
Indian Students
India evacuated 110 Indian students safely from Iran
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఆపరేషన్‌ సింధు
Scroll for the next article