Sports7th May 04:10 PMSunil Byrisetty1 min read

ఆపరేషన్ సిందూర్: ఐపీఎల్‌పై నీలినీడలు!

భారత సైనిక దళాలు పాక్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాలను నే

ఆపరేషన్ సిందూర్: ఐపీఎల్‌పై నీలినీడలు!
భారత సైనిక దళాలు పాక్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ సీజన్ కొనసాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. . ఇప్పటికే ఈ సీజన్‌లో 56 మ్యాచ్‌లు ముగియగా, లీగ్ దశలో మరో 14 మ్యాచ్‌లు, నాకౌట్‌, ఫైనల్‌తో కలిపి ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన తరుణంలో, ఏడు జట్లు టాప్-4 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేయాలా లేదా రద్దు చేయాలా అనేది బీసీసీఐ ముందు పెద్ద సవాలుగా మారింది.
IPL Match
Arun Dhumal
PlayOffs
BCCI
ఆపరేషన్ సిందూర్‌'తో ఉద్రిక్త పరిస్థితులు
ఐపీఎల్ సీజన్ కొనసాగుతుందా
25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్
Scroll for the next article