News7th May 12:14 PMSunil Byrisetty1 min read

ప్రతీకారం తీర్చుకున్న భారత్.. మోదీ జయహో!

భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. 'ఆపరేషన్ సిందూర్' భారత దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని ప్రపంచపటంపై

ప్రతీకారం తీర్చుకున్న భారత్.. మోదీ జయహో!
భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. 'ఆపరేషన్ సిందూర్' భారత దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని ప్రపంచపటంపై మరోసారి నిలిపిందన్నారు. హల్గాం దాడికి బదులుగా భారతదేశం సాహసోపేతంగా ప్రతీకారం తీర్చుకుందని తెలిపారు. ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్‌లను కొనసాగిస్తుందని స్పష్టం చేసిందన్నారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని బుద్ధి చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం ఆపాలన్నారు. దేశ రక్షణలో మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుదిట్టమైన విధానం అభినందనీయమని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
PM Modi
Operation Sindoor
Home Minister Vangalapudi Anitha
terrorist camps
ప్రతీకారం తీర్చుకున్న భారత్
హోంమంత్రి వంగలపూడి మోదీ జయహో
దేశ రక్షణలో మోదీ నాయకత్వం
Scroll for the next article