News7th May 09:41 AMSunil Byrisetty1 min read

పాక్ పై ఆపరేషన్ సిందూర్!

పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల

పాక్ పై ఆపరేషన్ సిందూర్!
పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. ఒక్క బహావల్‌పూర్‌లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మంది వరకూ టెర్రరిస్ట్‌లు హతమైనట్టు సమాచారం. అర్ధరాత్రి ఒంటిగంటా 28 నిమిషాలకు దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. రాజస్థాన్‌లోని ఖజువాలా నుంచి వైమానిక దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించారు.
India
Pakistan
Operation Sindoor
పాక్ పై ఆపరేషన్ సిందూర్
పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు
బహావల్‌పూర్
కోట్లీ
ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు
Scroll for the next article