News3rd Jan 05:36 PMSunil Byrisetty1 min read
ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్.. కేతిరెడ్డి వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వ
ఆపరేషన్ సిందూర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసే వరకు యుద్ధం కొనసాగుతోందనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. ప్రధాని స్థాయిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ అంటూ పోస్టులు పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఆపరేషన్ ఎందుకు ఆగిందో, దానికి కారణాలేంటో ప్రజలకు ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. అలాగే ఢిల్లీ పేలుడు కేసు విషయంలోనూ ఇప్పటివరకు ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు.
రోజురోజుకీ రూపాయి విలువ పడిపోతోందన్నారు. ఇలాంటి పరిస్థితి మరో ఐదేళ్లు కొనసాగితే దేశ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు. అయినా మనం ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.