Mobiles24th May 04:25 PMSunil Byrisetty1 min read

ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్!

ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్​లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'Oppo A5x 5G' ఫోన్​1000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను

ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్!
ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్​లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'Oppo A5x 5G' ఫోన్​1000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6000mAh బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది. కంపెనీ ఈ ఫోన్​పై ప్రారంభ ఆఫర్లను కూడా ప్రకటించింది. 6.67-అంగుళాల LCD స్క్రీన్‌, f/1.8 ఎపర్చర్​తో 32MP మెయిన్ రియర్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో రెండవ లెన్స్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్​ను అందించింది. దీనితో పాటు ఇందులో 4GB LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇది 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, GPS, GLONASS, USB టైప్-C వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. AI ఎరేజర్ 2.0, రిఫ్లెక్షన్ రిమూవర్, AI అన్‌బ్లర్, AI క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి అనేక AI ఫీచర్లు కూడా అందించారు. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, లేజర్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది. రూ.13,999లో ధరలో 4GB RAM, 128GB స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
Oppo A5x 5G
Oppo A5x 5G Specifications
Oppo A5x 5G Price
ఒప్పో భారత మార్కెట్​లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌
AI ఫీచర్లు
ఫోన్ మిడ్‌నైట్ బ్లూ
Scroll for the next article