Mobiles23rd Oct 11:09 AMSunil Byrisetty1 min read
ఒప్పో ప్రీమియం మోడల్స్.. కెమెరా చూస్తే మైండ్ బ్లాక్
భారత మార్కెట్లో ఒప్పో 2 శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. అత్యున్నత కెమెరా, భారీ బ్యాటరీలు, సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో'ఫైండ్ X10', 'ఫైండ్ X10 ప్రొ మ్యాక్స్' పేర్లతో వచ్చాయి
భారత మార్కెట్లో ఒప్పో 2 శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. అత్యున్నత కెమెరా, భారీ బ్యాటరీలు, సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో'ఫైండ్ X10', 'ఫైండ్ X10 ప్రొ మ్యాక్స్' పేర్లతో వచ్చాయి. ఈ మోడళ్లు 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ లో ప్రముఖ కెమెరా బ్రాండ్ హ్యాసిల్‌బ్లాడ్ భాగస్వామ్యంతో వెనుకవైపు మూడు 200MP కెమెరాలను అమర్చారు. ఇందులో ప్రధాన కెమెరా, 124-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన అల్ట్రా-వైడ్ లెన్స్, ఒక టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. 6.78-అంగుళాల డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఫైండ్ X10లో డ్యూయల్ 200MP రియర్ కెమెరా ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్‌తో 6.59-అంగుళాల డిస్‌ప్లే కూడా 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లలో 8,000mAh సామర్థ్యం గల సిలికాన్-కార్బన్ బ్యాటరీలు ఉన్నాయి. అయితే వీటి ధరలు లక్షా 40 వేల నుంచి మొదలవుతున్నాయి.