Politics2nd Oct 05:38 PMSunil Byrisetty1 min read

సీఈసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్.ఐ.ఆర్) లో భారీగా అక్రమాలు జరిగి 13 కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోప

సీఈసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్.ఐ.ఆర్) లో భారీగా అక్రమాలు జరిగి 13 కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ఎలక్షన్ కమిషనర్ (సిఈసి) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా నేడు విజయవాడలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు శుక్రవారం ప్రతిపక్షాలు, వామపక్ష నేతలు, కార్యకర్తలు, వివిధ పౌర సంఘాల ప్రతినిధులు భారీ నిరసన ప్రదర్శన చేస్తూ ర్యాలీగా తరలివచ్చారు. ర్యాలీ పాత బస్టాండ్ ఏలూరు రోడ్ మీదుగా లెనిన్ సెంటర్ వరకు సాగింది. కార్యకర్తలు ప్లే కార్డులు చేత బూని పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అమిత్ షా, మోదీ ద్వయం ఈ దేశాన్ని ఒక చెదలు పట్టిన పరిస్థితిలోకి తీసుకెళ్లారని, దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య స్వేచ్ఛను నాశనం చేస్తున్నారని విమర్శించారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ బిజెపి ఏజెంట్ అని, ఆయన తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. బిజెపికి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయవద్దని, అలా చేస్తే బిజెపి తరహాలోనే వారి పార్టీకి కూడా అదే గతి పడుతుందని చంద్రబాబుకి హితవు పలికారు.
Scroll for the next article