Politics10th Oct 01:04 PMSunil Byrisetty1 min read

ప్రతిపక్షాలు అతి తగ్గించుకోవాలి

దేశంలో పలు విపక్ష పార్టీలు అతిగా ప్రవర్తిస్తున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు, వ్యక్తిగత విమర్శల

ప్రతిపక్షాలు అతి తగ్గించుకోవాలి
దేశంలో పలు విపక్ష పార్టీలు అతిగా ప్రవర్తిస్తున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం సరి కాదన్నారు. మూకుమ్మడిగా ఓట్లు తొలగించారనే ప్రచారం అపోహ మాత్రమేనన్నారు. గెలిచినప్పుడు తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోయినప్పుడు ఈవీఎంలను నిందించడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలను ఆధారాలతో తెలియజేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ నిరసనలు హింసాత్మకంగా మారకూడదని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో లోటుపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
Scroll for the next article