News29th Jun 12:59 PMSunil Byrisetty1 min read

మూడేళ్లలో 4 లక్షల మందికి ఒరాకిల్ ద్వారా శిక్షణ

రాష్ట్రంలో ఐటీ వృద్ధికి అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌లో యువతకు శిక్షణఇచ్చి, వర్క్ ఫోర్స్‌ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేస

మూడేళ్లలో 4 లక్షల మందికి ఒరాకిల్ ద్వారా శిక్షణ
రాష్ట్రంలో ఐటీ వృద్ధికి అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌లో యువతకు శిక్షణఇచ్చి, వర్క్ ఫోర్స్‌ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఎపిఎస్ఎస్డీసి ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. దీని ద్వారా ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. తొలిఏడాది లక్షమందికి, రెండు, మూడు సంవత్సరాల్లో లక్షన్నర మందికి చొప్పున మొత్తం 4 లక్షలమందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా శిక్షణ ఇస్తారు. ఒరాకిల్ ఇన్ హౌస్ బృందం అభివృద్ధి చేసిన ఈ కోర్సులను నేర్చుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ అందించే ఎస్ డిఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందిస్తుంది.
Andhra Pradesh news
Andhra Pradesh State Skill Development Corporation
Oracle
free digital training to 4ts lakh students
Data Science
Scroll for the next article