News1st Jun 10:32 AMSunil Byrisetty1 min read
అమరావతిని మార్చే క్వాంటమ్ వ్యాలీ..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ జారీ చేసింది. 2026 జనవరి 1 నాటికి క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ను సిద్ధం చేయా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ జారీ చేసింది. 2026 జనవరి 1 నాటికి క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పార్క్ నిర్మాణానికి మూడు ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం సంస్థలు ఈ పార్క్‌ను నిర్మిస్తున్నాయి. ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ క్వాంటమ్ సిస్టం – 2 ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవతో పాటు క్వాంటంపై పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను అందించనుంది. ఎల్ అండ్ టీ క్లయింట్ నెట్‌వర్క్, స్టార్టప్‌ల నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని అందించనుంది. దీంతో అమరావతి రూపురేఖలు మారిపోనున్నాయి.