News2nd Aug 04:33 PMSunil Byrisetty1 min read
అవయవదాతలే నిజమైన విజేతలు
పేదలను దృష్టిలో పెట్టుకొని అవయవ మార్పిడి చికిత్సలు బోధనాసుపత్రుల్లోనూ ఎక్కువగా జరిగేందుకు వీలుగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడిoచారు. రాష్ట
పేదలను దృష్టిలో పెట్టుకొని అవయవ మార్పిడి చికిత్సలు బోధనాసుపత్రుల్లోనూ ఎక్కువగా జరిగేందుకు
వీలుగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడిoచారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వాసుపత్రులను దశలవారీగా పూర్తి స్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలోని ఏ యు కన్వెన్షన్ సెంటర్ లో జీవన్ దాన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యకమoలో మంత్రి మాట్లాడారు. జీవన్మృతులు అవయవాలను దానం చేస్తే ఎనిమిది మందికి కొత్త జీవితం అందించవచ్చని చెప్పారు. అవయవదానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని, ముందుగానే తమ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆదివారం నాటికి 5,935 మంది వివిధ అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. అవసరమైన అవయవాలు కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూస్తున్న రోగులకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ వైద్య వ్యవస్థ ద్వారానే శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ఈ విధానం లక్ష్యమన్నారు. అవయవదాతలే నిజమైన విజేతలని కొనియాడారు.