News6th Dec 03:47 PMSunil Byrisetty1 min read

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి అని ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి
సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి అని ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆయన సందర్శించారు. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. రైతులకు చేయూత ఇవ్వడంలో తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. గ్రామీణ రైతుల ఎఫ్ పిఒల ద్వారా గ్లోబల్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులను తయారు చేసే వారికి చేయూత ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం సెక్రటరీ చిరంజీవి చౌదరి, రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, నాబార్డ్ రిటైర్డ్ ఎం డి సూర్య కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, అవని ఆర్గానిక్స్ ఉషా గజపతి రాజులు మాట్లాడారు.
Andhra University
Organic Farmers
Natural Farming Fair
Minister Kondapalli Srinivas
Visakhapatnam
Farmer Support
Rural Farmers
FPOs
Global Network
Food Processing Department
భారతీయ కిసాన్ సంఘ్
ఆర్గానిక్ పంటలు
ప్రకృతి వ్యవసాయం
Scroll for the next article