News3rd Oct 11:11 AMSunil Byrisetty1 min read
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యమని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో పాన్-ఐఐటీ(PanIIT) కాన్ఫరెన్స్ ట
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యమని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో పాన్-ఐఐటీ(PanIIT) కాన్ఫరెన్స్ టీమ్ తో జరిగిన డిన్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'సీఎం చంద్రబాబు గురించి మీ అందరికీ తెలుసు. ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఒక్కో వెర్షన్‌తో మరింత మెరుగుపడుతుంటాయి. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి వెర్షన్‌తో మరింత మెరుగవుతున్నారు. ఇది ఆయన నాలుగో వెర్షన్. ప్రజాప్రభుత్వంలో 50 శాతం మంది శాసనసభ్యులు తొలిసారి ఎన్నికైనవారే. అలాగే 25 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇప్పుడు సీనియర్ మంత్రిని. రాష్ట్రాభివృద్ధి కోసం మేమంతా కసితో, పట్టుదలతో పనిచేస్తున్నామ’ని పేర్కొన్నారు.