News12th Sep 04:57 PMSunil Byrisetty1 min read
నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 2
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు రూ.2,00,32,615.41లను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చింది. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు పెంచేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చేనేత బజార్లు నిర్వహిస్తోంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకుంది. 93 వేల చేనేత కుటుంబాలుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 11,488 మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తోంది. 50 ఏళ్లు నిండిన 92,724 మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తోంది. నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. ఆప్కోకు వస్త్రాలు విక్రయించే నేతన్నలకు అయిదు శాతం జీఎస్టీ మినహాయిస్తోంది.