Spiritual15th Dec 11:42 AMSunil Byrisetty1 min read
అయ్యప్పను సేవలో 25లక్షల మంది
శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడికి వస్తు
శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో మొత్తంగా 21 లక్షల మంది అయ్యప్ప దర్శనానికి వచ్చారు. డిసెంబర్ చివరి నాటికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శబరిమలలో నవంబరు 16న ప్రారంభమైన మండల పూజా మహోత్సవాలు.. డిసెంబర్ 27న ముగియనున్నాయి. దీంతో భక్తుల రద్దీ పెరగనుందని చెబుతున్నారు.