Spiritual22nd Jul 05:37 PMSunil Byrisetty1 min read
అమర్నాథ్ యాత్రలో భక్తుల రద్దీ
హిమాలయాల దగ్గర మంచు లింగంగా కొలువైన అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మహాశివుడిని దర్శించుకున్నారు. జులై
హిమాలయాల దగ్గర మంచు లింగంగా కొలువైన అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మహాశివుడిని దర్శించుకున్నారు. జులై 2వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 19 రోజుల్లో 3.21 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ యాత్ర ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున
ముగియనుంది. భక్తుల రద్దీ చూస్తే మరో 3 లక్షల మందికిపైగా దర్శించుకుంటారని అంచనా.