News25th Jul 05:15 PMSunil Byrisetty1 min read
మార్గదర్శులుగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. శుక
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై జరిగిన సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగాస్వాములు అవుతారని చెప్పారు. అందరిలో చైతన్యం నింపేలా... మరింత మంది సంపన్నులు మార్గదర్శులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహద పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని...మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని..విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరిన ఉందని వెల్లడించారు.