News1st Jun 09:33 AMSunil Byrisetty1 min read
యోగాంధ్రకు కోటికి పైగా పేర్లు నమోదు
యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు నమోదు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రారంభించిన పది రోజుల్లోనే లక్ష్యసాధనలో సగానికి పైగా దాటింది. ఈ కార్యక్రమంలో 2 కోట్ల మం
యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు నమోదు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రారంభించిన పది రోజుల్లోనే లక్ష్యసాధనలో సగానికి పైగా దాటింది. ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే కోటిమందికి పైగా పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘యోగాంధ్ర’ ప్రచార కార్యక్రమానికి మొదటి 10 రోజుల్లో 1,13,47,935 మంది స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని యోగాంధ్ర నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు మంత్రుల కమిటీకి నివేదించారు.
మే 21 నుంచి మే 30 వరకు మొదటి 10 రోజులకు 69,92,478 నమోదు చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్ణయించుకోగా, వాస్తవ రిజిస్ట్రేషన్లు 162% మేర పూర్తయ్యాయని నివేదించారు. ఈ కాలంలో మాస్టర్ ట్రైనర్ల నమోదు 408% కాగా, శిక్షకుల నమోదు 113% మేర జరిగిందని ఆయన తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతారని ఆయన తెలిపారు.