Politics4th Nov 04:18 PMSunil Byrisetty1 min read

ఆత్మకూరు సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

ఆత్మకూరు పురపాలక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం మన బాధ్యతను మరింత పెంచిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎన్డీఏ కూటమి విజయం సందర్భంగా మంత్రి ఆనం ఆధ్వర్యంలో ప్రత్యే

ఆత్మకూరు సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం
ఆత్మకూరు పురపాలక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం మన బాధ్యతను మరింత పెంచిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎన్డీఏ కూటమి విజయం సందర్భంగా మంత్రి ఆనం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి కార్యాలయంలో గెలుపొందిన చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో మంత్రి ఆనం సమావేశమయ్యారు. పురపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించిన ఆత్మకూరు ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎన్డీఏ కూటమిపై ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమన్నారు. ఆత్మకూరు అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Scroll for the next article