News13th Apr 02:51 PMSunil Byrisetty1 min read

వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధమన్న ఒవైసీ

వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధంగా ఉందని, ప్రధాని మోదీ పున: పరిశీలించాలని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ నెల 19న వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్

వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధమన్న ఒవైసీ
వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధంగా ఉందని, ప్రధాని మోదీ పున: పరిశీలించాలని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ నెల 19న వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నామన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు హైదరాబాద్‌లో జరిగే నిరసనలో పాల్గొంటారని చెప్పారు. వక్ఫ్‌ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారని, ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. వక్ఫ్‌ అంటే తన దృష్టిలో ఓ ప్రార్థనా స్థలమన్నారు. వక్ఫ్‌ బిల్లుకు చంద్రబాబు, నితీష్‌ మద్దతిచ్చారని, ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ సర్కార్‌ పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 26కు విఘాతం కలుగుతోందని, వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని అసద్ పేర్కొన్నారు.
Owaisi
Waqf Bill is illegal
ప్రధాని మోదీ
హైదరాబాద్‌
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
Scroll for the next article