News12th Dec 04:32 PMSunil Byrisetty1 min read

బరువు తగ్గించే ఒజెంపిక్ ఇంజెక్షన్.. ధ‌ర ఎంతో తెలుసా!

బరువు తగ్గించే ఔషధం 'ఒజెంపిక్' ఇంజెక్షన్ భారతదేశం‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ దీన్ని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. టైప్ 2 మధుమేహం నియంత్రణ కోస

బరువు తగ్గించే ఒజెంపిక్ ఇంజెక్షన్.. ధ‌ర ఎంతో తెలుసా!
బరువు తగ్గించే ఔషధం 'ఒజెంపిక్' ఇంజెక్షన్ భారతదేశం‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ దీన్ని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. టైప్ 2 మధుమేహం నియంత్రణ కోసం అధికారికంగా అనుమతి పొందిన ఈ డ్రగ్‌కు, బరువు తగ్గించే గుణం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీని నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా ఉంది. వారానికి ఒకసారి తీసుకునే ఈ ఇంజెక్షన్ 0.25mg, 0.5mg, 1mg డోసుల్లో లభిస్తుంది. 'నోవోఫైన్ నీడిల్స్' అనే ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలోని దీన్ని నొప్పి లేకుండా సులభంగా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని అందిస్తున్నారు. ప్రారంభ డోస్ అయిన 0.25mg పెన్ ధర రూ. 8,800 కాగా, 0.5mg ధర రూ. 10,170, 1mg ధర రూ. 11,175గా కంపెనీ నిర్ణయించింది. ప్రతి పెన్‌లో నాలుగు వారాలకు సరిపడా డోసులు ఉంటాయి.
India Launch
Type 2 Diabetes
Obesity Treatment
Injection Cost
0.25mg Dose
0.5mg Dose
1mg Dose
Healthcare News
Pharma Updates
Weight Management
Scroll for the next article