News12th Dec 11:10 AMSunil Byrisetty1 min read
అధికార భాషా సంఘం చైర్మన్ గా పి. త్రివిక్రమరావు
ప్రపంచం నలుమూలలా తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేలా అధికార భాషా సంఘం సారధిగా, వారధిగా పనిచేస్తుందని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన చైర్మన్ పి.
ప్రపంచం నలుమూలలా తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేలా అధికార భాషా సంఘం సారధిగా, వారధిగా పనిచేస్తుందని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన చైర్మన్ పి. త్రివిక్రమరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం చైర్మన్ గా నియమితులైన పి. త్రివిక్రమరావు (విక్రమ్ పూల) స్థానిక పున్నమి ఘాట్ లోని హరిత బెర్మ్ పార్క్ సమావేశ మందిరంలో పదవీ బాధ్యతల స్వీకరోత్సవ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిధిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ పి. త్రివిక్రమరావు మాట్లాడుతూ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, ఆత్మీయులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్ గా తనను నియమించడం మర్చిపోలేనన్నారు. అదేవిధంగా నా నియామకానికి తోడ్పడిన వారిలో మంత్రి నారా లోకేష్, కూటమి నాయకులు ఉన్నారన్నారు.