Politics21st Mar 04:11 PMSunil Byrisetty1 min read
ఉగాదికి పీ4 ప్రారంభోత్సవం
ఉగాది రోజున ‘జీరో పావర్టీ-పీ4’ (పబ్లిక్- ప్రైవేట్- పీపుల్- పార్టనర్‌షిప్) ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 30న జరిగే ప్రారంభోత్సవ సమావేశంపై ప్ర
ఉగాది రోజున ‘జీరో పావర్టీ-పీ4’ (పబ్లిక్- ప్రైవేట్- పీపుల్- పార్టనర్‌షిప్) ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు.
మార్చి 30న జరిగే ప్రారంభోత్సవ సమావేశంపై ప్రధానంగా అధికారులతో చర్చించారు.
మహిళలు, గ్రామీణ ప్రజలను పీ4లో ప్రధాన భాగస్వాముల్ని చేయాలని, దీని అమలులో పారదర్శకత, విధాన రూపకల్పన అవసరమని అధికారులకు స్పష్టం చేశారు.
పీ4 విధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు ప్రజల నుంచి అభిప్రాయాల్ని తీసుకోవాలని సూచించారు.
దీర్ఘకాలిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని... పీ4 సొసైటీని ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో నెలకొల్పాలన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా... మరింత మంది పీ4 విధానాన్ని అర్థం చేసుకుని ప్రయోజనం పొందేలా సన్నాహాలు జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.
స్వర్ణాంధ్ర -2047 విజన్ పది సూత్రాల అమలులో భాగంగా ‘జీరో పావర్టీ-పీ4’ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.
ప్రజల ఆర్థిక వృద్ధికి దోహదపడేలా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడటమే పీ4 ప్రధాన లక్ష్యం.
ఆర్థికంగా సంపన్నులైన అగ్రశ్రేణి 10 శాతం కుటుంబాలు..
పేదరికంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలకు మార్గదర్శకత్వం వహించడంతో పాటు వారి ఆర్ధిక ఎదుగుదలకు మద్దతుగా నిలిచేలా చేస్తాయి.
పీ4 అమలు ద్వారా సామాజిక-ఆర్థిక అంతరాలను తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.