Farmers20th Oct 10:10 AMSunil Byrisetty1 min read
27 నుంచి ధాన్యం కొనుగోళ్లు
ఏపీలో ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా కొనుగోలు జరుపుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సేకరించిన 48 గంటల్లోగా డబ్బు జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈన
ఏపీలో ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా కొనుగోలు జరుపుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సేకరించిన 48 గంటల్లోగా డబ్బు జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మనోహర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.