Entertainment1st Jun 11:53 AMSunil Byrisetty1 min read
తెలుగు జాతి స్ఫూర్తి, కీర్తి ఎన్టీఆర్
భారతీయ చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన మహానటులు, తెలుగు జాతి స్ఫూర్తి, కీర్తి కీ.శే ఎన్టీఆర్ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఎక్స్ రే
భారతీయ చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన మహానటులు, తెలుగు జాతి స్ఫూర్తి, కీర్తి కీ.శే ఎన్టీఆర్ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన "పద్మశ్రీ డా. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దుర్గేష్ పాల్గొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులకు ఎన్టీఆర్ స్మారక పురస్కారాలు ప్రదానం చేశారు. సినిమా రంగంలో ఆల్ రౌండర్ గా పేరొందిన రాజేంద్రప్రసాద్ కు ఎన్టీఆర్ స్మారక పురస్కారం అవార్డు అందజేయడం గొప్ప విషయమన్నారు. పురస్కారాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
కుటుంబ విలువలను సమాజానికి తెలిపేలా తెరకెక్కించిన షష్టిపూర్తి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. నిడదవోలు నియోజకవర్గానికి చెందిన సూర్యకాంతంకు ఎన్టీఆర్ స్మారక పురస్కారం లభించడంపై మంత్రి దుర్గేష్ అభినందించారు.