News23rd Apr 10:23 AMSunil Byrisetty1 min read
కశ్మీర్లో ఉగ్ర దాడి.. 26 మంది మృతి
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం రెచ్చిపోయింది. హిందువులనే టార్గెట్‌గా విరుచుకుపడింది. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. పర్యాటకులపై జరిగిన కా
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం రెచ్చిపోయింది. హిందువులనే టార్గెట్‌గా విరుచుకుపడింది.
జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు.
పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనతో పహల్గాంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే, పహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఎగువ ప్రాంతంలోని ఒక పర్యాటక రిసార్టు వద్ద ఈ దాడి జరిగింది.
ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకునే వీలుంటుంది.
ఇలాంటి ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
సైనిక తరహా దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తయ్యిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.
దాడికి బాధ్యత వహించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్-TRF ఉగ్రవాద సంస్థ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే ఏర్పాటైంది.
తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించిన ఆ సంస్థ, ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని ఒక గ్రూపుగా ఏర్పాటైంది. ఉగ్రదాడిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.