International7th May 11:20 AMSunil Byrisetty1 min read
ఉగ్రస్థావరాల ధ్వంసంపై స్పందించిన చైనా!
ఉగ్రస్థావరాల ధ్వంసంపై చైనా స్పందించింది. భారత్ దాడి చేయడం విచారకరమంటూ విషం కక్కింది. పాక్ ఉగ్రవాదుల దాడిపై సానుభూతి పలికిన చైనా ఇప్పుడు భారత్ దాడిని మాత్రం విచారకరమనడంపై ప్రపంచ దేశ
ఉగ్రస్థావరాల ధ్వంసంపై చైనా స్పందించింది.
భారత్ దాడి చేయడం విచారకరమంటూ విషం కక్కింది.
పాక్ ఉగ్రవాదుల దాడిపై సానుభూతి పలికిన చైనా ఇప్పుడు భారత్ దాడిని మాత్రం విచారకరమనడంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.
భారత్, పాకిస్తాన్ రెండూ తమ పొరుగు దేశాలని, ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామంటూ తన కుటిల బుద్ధిని చైనా మరోసారి బయటపెట్టుకుంది.
అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కంటితుడుపు వ్యాఖ్యలు చేసింది.
శాంతి, స్థిరత్వం కోసం భారత్ - పాక్ చొరవ చూపాలని సూచించింది.
పరిస్థితిని సంక్లిష్టం చేయకుండా సంయమనం పాటించాలని చైనా పేర్కొంది.