Health17th Apr 02:11 PMSunil Byrisetty1 min read

సూది లేని ఇంజెక్షన్.. నొప్పి లేని వైద్యం!

ఇంజెక్షన్ అంటే చాలామంది భయపడిపోతుంటారు. అమ్మో నొప్పిగా ఉంటుందంటారు. ఇలాంటి భయాలకు చెక్ పెట్టేలా త్వరలోనే సూదిలేని ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని 'ఇంటెగ్రి మెడికల్' సంస్థ ప

సూది లేని ఇంజెక్షన్.. నొప్పి లేని వైద్యం!
ఇంజెక్షన్ అంటే చాలామంది భయపడిపోతుంటారు. అమ్మో నొప్పిగా ఉంటుందంటారు. ఇలాంటి భయాలకు చెక్ పెట్టేలా త్వరలోనే సూదిలేని ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని 'ఇంటెగ్రి మెడికల్' సంస్థ ప్రకటించింది. "ఎన్-ఫిస్' పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రకటించింది. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుంది. దాంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం వెళ్తుంది. దీనిని ఇప్పటికే దేశంలో వెయ్యి మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారని ఇంటెగ్రి మెడికల్ సంస్థ ప్రకటించింది. ప్రయోగాల అనంతరం అందరికీ అందుబాటులోకి తేనుంది.
Needle Free Injections
National Library of Medicine
mednexus
సూది లేని ఇంజెక్షన్లు
ఎన్-ఫిస్
Scroll for the next article