Politics29th Apr 03:18 PMSunil Byrisetty1 min read
రాజ్యసభ అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. భీమవరానికి చెందిన సీనియర్ నేత పాకా వెంకట సత్యనారాయణను ఖరారు చేసింది. ఎన్డీయేలోని అ
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది.
భీమవరానికి చెందిన సీనియర్ నేత పాకా వెంకట సత్యనారాయణను ఖరారు చేసింది.
ఎన్డీయేలోని అన్ని పార్టీల మద్దతుతో ఆయన పేరు ఫైనల్ చేశారు.
మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన వెంకట సత్యనారాయణ పాకా రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.