National14th May 01:25 PMSunil Byrisetty1 min read

భారత జవాన్‌ను తిరిగి అప్పగించిన పాక్

పాక్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారతదేశానికి అప్పగించింది. అటారీ-వాఘా బార్డర్ ద్వారా మనదేశానికి పంపింది. ఏప్రిల్ 23న తమ సరిహద్దులోకి అనుకోకుండా ప

భారత జవాన్‌ను తిరిగి అప్పగించిన పాక్
పాక్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారతదేశానికి అప్పగించింది. అటారీ-వాఘా బార్డర్ ద్వారా మనదేశానికి పంపింది. ఏప్రిల్ 23న తమ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. అతని కోసం పాక్ రేంజర్లతో నిరంతరం ఫ్లాగ్ మీటింగ్స్, ఇతర మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది. దీనికి ప్రతిగా తమ చెరలోని ఓ పాక్ జవాన్‌ను ఆ దేశానికి భారత్ అప్పగించింది. కాల్పుల విరమణ తర్వాత చర్చల్లో భాగంగా ఇరు దేశాలు జవాన్లను స్వదేశాలకు పంపాయి.
BSF Jawan Purnam Sahu
pakistan
indan army
భారత జవాన్‌ను తిరిగి అప్పగించిన పాక్
అటారీ-వాఘా బార్డర్
Scroll for the next article