News28th Apr 11:10 AMSunil Byrisetty1 min read

భారత్‌పై విషం.. పాక్ చానెళ్లపై వేటు!

భారతదేశంపై విషయం కక్కుతున్న పాకిస్థాన్ యూట్యూబ్ చానెళ్లపై వేటు పడింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ చర్యలను భారత ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోంది. హోంమంత్రిత్వశాఖ సిఫార్సులతో

భారత్‌పై విషం.. పాక్ చానెళ్లపై వేటు!
భారతదేశంపై విషయం కక్కుతున్న పాకిస్థాన్ యూట్యూబ్ చానెళ్లపై వేటు పడింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ చర్యలను భారత ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోంది. హోంమంత్రిత్వశాఖ సిఫార్సులతో పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ చానళ్లను నిషేధించింది. వీటిలో డాన్, సామా టీవీ, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, ఆస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తార్, సునో న్యూస్, పాకిస్థాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి చానళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి మొత్తం 6.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పహల్గాం దాడి తర్వాత ఈ చానళ్లు భారత్‌పై విషం కక్కుతున్నాయని, రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడికి పశ్చాత్తాపం చెందకపోగా భద్రతా సంస్థలను రెచ్చగొట్టేలా ఇవి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఆయా చానెళ్లపై వేటు వేసింది.
india vs pakistan
pahalgam terror attack
పహల్గాం ఉగ్రదాడి
పాకిస్థాన్ యూట్యూబ్ చానెళ్లపై వేటు
సామా టీవీ
ఏఆర్‌వై న్యూస్
జియో న్యూస్
Scroll for the next article