News22nd Sep 02:56 PMSunil Byrisetty1 min read
మోదీ చిత్రపటానికి పాలాభిషేకం?!
జిఎస్టి తగ్గింపు ద్వారా దేశ ప్రజలకు భారీ ఉపశమనం కలిగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళగిరి పట్టణ బిజెపి ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
జిఎస్టి తగ్గింపు ద్వారా దేశ ప్రజలకు భారీ ఉపశమనం కలిగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళగిరి పట్టణ బిజెపి ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఓబిసి అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, జిఎస్టి తగ్గింపు ద్వారా దేశవ్యాప్తంగా ₹2.5 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు ₹8 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని తెలిపారు. 149 వస్తువులు పూర్తిగా జిఎస్టి నుంచి మినహాయింపు పొందగా, తాజా పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు, పప్పులు, పండ్లు, మాంసం, చేపలు, తాగునీరు తదితరాలు వాటిలో ఉన్నాయని వివరించారు. అలాగే, సిమెంటు పన్ను 28% నుంచి 18%కి తగ్గించడం, బ్రష్లు, సబ్బులు, పేస్టులు వంటి నిత్యావసర వస్తువుల పన్ను 12% నుంచి 5%కి తగ్గించడం సాధారణ ప్రజలకు ఊరట కలిగించిందన్నారు.