News14th Oct 02:34 PMSunil Byrisetty1 min read

గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండగ 2.0

పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణ

గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండగ 2.0
పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైయిన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఒ.ఎస్.డి. వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Pawan Kalyan
Palle Panduga
Rural Development
Panchayati Raj
Infrastructure
Roads
Goshalas
Magic Drains
ప్రభుత్వ కార్యక్రమాలు
శశిభూషణ్ కుమార్
కృష్ణతేజ
బాలునాయక్
గ్రామీణ ప్రగతి
Scroll for the next article