News15th Jan 10:57 AMSunil Byrisetty1 min read
గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0
పల్లెపండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తిరువూరు నియోజకవర్గం, గంపల గూడెంలో గ్రామీణ ఉపాది హామీ పథకం కింద రూ.41
పల్లెపండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తిరువూరు నియోజకవర్గం, గంపల గూడెంలో గ్రామీణ ఉపాది హామీ పథకం కింద రూ.41 లక్షల అంచనా విలువతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ శంకుస్థాపన చేశారు.
గంపలగూడెంలో రోడ్ల శంకుస్థాపనకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, గంపలగూడెం మండలం తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ (ఎమ్.ఆర్.కె) స్థానిక ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, మరోవైపు పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.