News27th Sep 01:06 PMSunil Byrisetty1 min read
పల్లెల్లో అభివృద్ధి వెలుగులు
పల్లెల్లో అభివృద్ధి వెలుగులు నింపేలా 29న పల్లె పండుగ 3.0కి శ్రీకారం చుడుతోంది. పల్లె పండుగ 3.0 కింద రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నారు
పల్లెల్లో అభివృద్ధి వెలుగులు నింపేలా 29న పల్లె పండుగ 3.0కి శ్రీకారం చుడుతోంది. పల్లె పండుగ 3.0 కింద రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పనుల ప్రారంభం కానున్నాయి.
గ్రామాల్లో రూ. 2,700 కోట్ల వ్యయంతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం, రూ.7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల బిటి రోడ్ల పనులు ప్రారంభిస్తారు. రూ.300 కోట్లతో పాడి రైతుల కోసం 22,000 మిని గోకులాల నిర్మాణం, రూ. 225 కోట్ల వ్యయంతో ఉద్యానవన శాఖ ద్వారా 50,000 ఎకరాల్లో తోటల పెంపకం చేపట్టనున్నారు.