News16th Aug 04:57 PMSunil Byrisetty1 min read

భవిష్యత్తులో విమాన ఇంధనంగా పామాయిల్!

రాష్ట్రంలో గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడుతున్న పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభవార్త చెప్పారు. దెందులూరు మండలం, చల్ల చింతలపూడి గ్రామంలో శనివారం జరిగిన శ్రీకృష్ణ జన్మ

భవిష్యత్తులో విమాన ఇంధనంగా పామాయిల్!
రాష్ట్రంలో గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడుతున్న పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభవార్త చెప్పారు. దెందులూరు మండలం, చల్ల చింతలపూడి గ్రామంలో శనివారం జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. విమాన ఇంధనంలో పామాయిల్ కలిపి వాడే విధంగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు విజయవంతం అయ్యాయని, వచ్చే 10-12 ఏళ్లలో విమాన ఇంధనంగా పామాయిల్ వాడే పరిస్థితి వస్తే ఆయిల్ పామ్ రైతుల కష్టాలు తీరిపోతాయని చెప్పారు. అప్పుడు ఆయిల్ పామ్ ధర టన్నుకు 50 వేలకు చేరే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రైతులు ఆయిల్ పామ్ పంటను విరివిగా సాగు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ పిలుపునిచ్చారు.
Andhra Pradesh
Palm Oil
Aviation Fuel
Biofuel Research
Farmers Welfare
Oil Palm Cultivation
Putta Mahesh Kumar
Future Energy
Palm Oil Price
పామాయిల్ రైతులు
విమాన ఇంధన భవిష్యత్తు
Scroll for the next article