Health9th Nov 05:05 PMSunil Byrisetty1 min read
రోగుల వైద్య సేవల్లో పల్నాడు జిల్లా అగ్రస్థానం
ప్రభుత్వ పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల పనితీరు మెరుగుపరచడంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 81.6 శాతం ప్రజాభిప్రాయాలతో పల్నాడు అగ్రస్థానంలో ఉండ
ప్రభుత్వ పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల పనితీరు మెరుగుపరచడంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 81.6 శాతం ప్రజాభిప్రాయాలతో పల్నాడు అగ్రస్థానంలో ఉండగా, 81.5 శాతంతో పోలవరం, 80.7 శాతంతో నెల్లూరు, 78.3 శాతంతో తిరుపతి, 77.5 శాతంతో కృష్ణా జిల్లాలు వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. గత జూలై నుంచి నవంబరు 7 వరకు ఐవీఆర్ఎస్ ద్వారా రోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా వైద్యారోగ్య శాఖ జిల్లాల పనితీరును అంచనా వేసింది. వైద్యుల అందుబాటు, మందులు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలపై రోగులు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. గడచిన ఐదు నెలల పనితీరు ఆధారంగా వెనుకబడిన జిల్లాల్లో కర్నూలు 69.5 శాతం, అనంతపురం 69.8 శాతం, ఎన్టీఆర్ జిల్లా 70.9 శాతం, అనకాపల్లి 71.5 శాతం, మార్కాపురం 71.8 శాతంతో ఉన్నాయి. అక్టోబరు నెలకు సంబంధించి వైద్యుల అందుబాటు, పారిశుద్ధ్యం, వైద్య సేవలకు డబ్బులు అడిగారా?, మందులు ఇచ్చారా? అనే నాలుగు అంశాలపై ఐవీఆర్ఎస్ ద్వారా రోగుల అభిప్రాయాలను సేకరించారు. ఈ నాలుగు అంశాల కు సంబంధించి ఒక్కో అంశంలో 100 శాతం ప్రతికూల సమాధానo వచ్చిన రాష్ట్రంలో 135 మంది వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.