Spiritual9th Nov 03:00 PMSunil Byrisetty1 min read

పంబలో వేగంగా అభివృద్ధి పనులు!

శబరిమల యాత్రా సీజన్ను దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పంబలో ఏర్పాట్లను వేగవంతం చేసింది. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక స్టాళ్ల స్థానంలో శాశ్వత స్టాళ్ల నిర్మాణం చేపడుతున

పంబలో వేగంగా అభివృద్ధి పనులు!
శబరిమల యాత్రా సీజన్ను దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పంబలో ఏర్పాట్లను వేగవంతం చేసింది. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక స్టాళ్ల స్థానంలో శాశ్వత స్టాళ్ల నిర్మాణం చేపడుతున్నారు. అలాగే శౌచాలయ ప్రాంగణాల్లో ఇంటర్లాకింగ్ టైల్స్ వేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏర్పాట్లతో పంబ పుణ్యక్షేత్రం మరింత సుందరంగా మారనుంది. శబరిమల మండలం-మకరవిళక్కు మహోత్సవానికి వచ్చే కోట్లాది మంది అయ్యప్ప భక్తుల సౌకర్యం, భద్రత కోసం కేరళ ప్రభుత్వం 'శబరి పోర్టల్'ను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు sabariportaldcpta.in వెబ్సైటు ద్వారా రవాణా, వైద్య సేవలు, దర్శన సమయాలు, ఫిర్యాదుల నమోదు వంటి సమాచారాన్ని సులభంగా పొందవచ్చు.
Scroll for the next article